టెక్ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాక్!
లేబర్ చట్టాల నుండి మినహాయింపు పొందుతున్న టెక్ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుండి ఈ మినహాయింపును రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. రాష్ట్రంలో సంస్థలను ప్రోత్సహించేందుకు 2014 లో ఈ మినహాయింపును అమలు చేసింది. అకారణంగా ఉద్యోగులను తీసివేయడం, లైంగిక వేధింపులు, పనిఒత్తిడి మొదలైన కేసులు పెరుగుతున్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర లేబర్ శాఖ వెల్లడించింది.