కన్నడ ఎలక్షన్ వార్ షురూ
కన్నడ నాట ఎన్నికల హడావుడి మొదలయిపోయింది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని ముగించబోతున్నాయి. ఈ సందర్భంలో ప్రధానిమోదీ కర్ణాటక ప్రజలకు ఒక లేఖ విడుదల చేశారు. తన సందేశాన్ని వినిపించారు. ప్రతీ కన్నడ పౌరుని కల తనకలగానే భావిస్తానన్నారు. ఈ కల సాకారం కావాలంటే మీ సహకారం కావాలన్నారు. సరైన వ్యక్తులను ప్రతినిధులుగా ఎన్నిక చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకున్నారు. ప్రలోభాలకు గురికావద్దని, ప్రజాసంక్షేమమే అన్నింటికన్నా ముఖ్యమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలయ్యింది. ఇప్పటికే పోలింగ్‌కు కావలసిన ఈవీయంల తరలింపు చేస్తున్నారు. 224 అసెంబ్లీ నియోజక వర్గాలకు, 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదుకోట్ల ముప్పైఒక్క లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తొలిసారి ఓటుహక్కు పొందిన వారు కూడా 9 లక్షల మందికి పైగా ఉన్నారు. ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.