Home Page SliderNational

కరెన్సీ కంటే కంటెంటే కావాలంటున్న కరీనా కపూర్

బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్ కరీనా కపూర్‌ తన సినీ కెరీర్‌పై క్రేజీ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్‌లో నేను ఒకదాన్ని., నేను కేవలం రెమ్యునరేషన్‌ని దృష్టిలో ఉంచుకొని సినిమాల్లో నటించను. నాకు కథ ముఖ్యం. నా పాత్ర ముఖ్యం. కథ నచ్చితేనే ఆ సినిమా చేస్తాను. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి పాటిస్తున్న నియమం’ అని కరీనా చెప్పింది.

 ‘నేను నటించిన సినిమా ఎలాంటిది..?, నా పాత్రకి ఉన్న ప్రాధాన్యత ఎంత ?, ఇలా ప్రతి అంశాన్ని చూస్తాను. ప్రేక్షకులకు ఏదో ఒక సందేశాన్ని సమాజంపై ప్రభావం చూపించేలా కథ ఉండటం నాకు ఇష్టం. అలాంటి నిర్మాతలు వస్తే కచ్చితంగా తక్కువ రెమ్యునరేషన్‌ ఇచ్చినా.. నటించడానికి రెడీ’ అంటూ కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ‘ది బకింగ్‌ హామ్‌ మర్డర్స్‌’తో కరీనా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.