Home Page SliderTelangana

ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటే శిక్షణ

మఠంపల్లి: ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటేలో శిక్షణ ఇప్పించేందుకు రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ పేరుతో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో సన్నహాలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా 368 స్కూల్స్‌లో నవంబర్ 1 నుండి శిక్షణా కార్యక్రమాలు చేపట్టారు. ఒక్కో మండలం నుండి 4, 5 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి 8 నుండి పదో తరగతి వరకు బాలికలకు వివిధ అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. మూడు నెలల కాల పరిమితిలో 33 రోజులు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.