కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెరవేరిన వేళ..!
టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా హాట్ టాపిక్‌గా నిలిచాడు కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి. ఈ టాలెంటెడ్ యాక్టర్ తెరకెక్కించిన కాంతార ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిందో మీకు తెలుసు. రిషబ్ శెట్టికి ఓ కల ఉంది. అది కూడా 24 ఏళ్ళకు తీరింది. శాండల్‌వుడ్ (కన్నడ) నుండి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా, అగ్రదర్శక నిర్మాతల ఫోకస్ ఇండస్ట్రీవైపు పడేలా చేశాడనడంలో సందేహం లేదు. ఎవరికైనా ఏదో ఒక గోల్‌కు చేరాలని ఉంటుంది కదా. విక్రమ్ తంగలాన్ ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరులో సందడి చేశాడు. ఈ సందర్భంగా విక్రమ్‌ను కలిశాడు రిషబ్ శెట్టి. ఈ అరుదైన సందర్భాన్ని అందరితో పంచుకున్నాడు రిషబ్ శెట్టి. నటుడిగా అయ్యే క్రమంలో నా ప్రయాణానికి స్ఫూర్తి విక్రమ్ సార్. నా లాంటి నటులకు స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు. మీ తంగలాన్ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా.. లవ్ యూ విక్రమ్ అంటూ సోషల్ మీడియాలో తన ఎక్సైట్‌మెంట్‌ను షేర్ చేశాడు కాంతార హీరో. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. రాబోయే రోజుల్లో రిషబ్ శెట్టి, విక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎంత బాగుంటుందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


 
							 
							