బద్వేలు ఘటనలో కన్నతల్లి తీవ్ర ఆవేదన
కడప వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనలో చనిపోయిన విద్యార్థిని తల్లి ఆవేదన మాటలకందడం లేదు. ముక్కుపచ్చలారని తన 17 ఏళ్ల కుమార్తెను పాశవికంగా పెట్రోల్ పోసి కాల్చేసిన విఘ్నేష్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తల్లి. ఆమె వేదన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. నేరస్తుడికి కఠిన శిక్ష వేయాలని, నడిరోడ్డుపై ఉరి తీయాలని కోరుకున్నారు. రిమ్స్ హాస్పటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ‘మీరు ఏం చేయగలరు? వాడిని నడిరోడ్డుపై ఉరితీస్తారా? లేదా వాడిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టగలరా? నా కూతురిని అన్యాయంగా చంపేశాడు. వాడిని వదలకూడదు’ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.