Home Page Sliderhome page sliderTelangana

కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం..

మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డ్రైవ్ పట్టుకొని ఆఫీస్ బాయ్ రఘు పారిపోయాడని తెలుస్తోంది . 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై నమ్మక ద్రోహం కేసు నమోదు చేశారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఫిర్యాదుతో ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు కన్నప్ప మూవీకి సంబంధించిన డేటా ఉన్న హార్డ్ డిస్క్ ను మంచు మనోజ్ మాయం చేశాడంటున్న విష్ణు వర్గం ఆరోపిస్తోంది. తన పీఏ రఘు, అసిస్టెంట్ చరిత సాయంతో హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హార్డ్ డిస్క్ లోని కన్నప్ప క్లిప్స్ ఆన్ లైన్ లో లీక్ చేస్తామని మనోజ్ వర్గం బెదిరిస్తోందని విష్ణు వర్గం ఆరోపణ చేసింది.