Andhra PradeshHome Page Slider

కన్నకొడుకే కాలయముడు

కన్న కుమారుడే తండ్రిని హతమార్చిన ఘటన గురువారం అర్ధరాత్రి ఆగిరిపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల గ్రామానికి చెందిన కేదాసి శ్రీనివాసరావు (47) అనే వ్యక్తి..

ఆగిరిపల్లి: కన్న కొడుకే తండ్రిని చంపిన ఘటన గురువారం అర్ధరాత్రి ఆగిరిపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల గ్రామానికి చెందిన కేదాసి శ్రీనివాసరావు (47) అనే వ్యక్తి.. తన కుమారుడు తేజను చెడు వ్యసనాలను మానుకో, గౌరవంగా బతుకు అని హితవు చెప్పినందుకు, కోపావేశంలో తేజ ఇటుక రాయితో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సీఐ పి.బాలసురేష్, ఎస్‌ఐ ఎన్.చంటిబాబు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.