Andhra PradeshNews

బీజేపీకి కన్నా గుడ్ బై? టీడీపీలోకి వెళ్తారా?

బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నాయకత్వంపై కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న కన్నా.. ముఖ్య అనుచరులతో సమావేశం కావాలని నిర్ణయించారు. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించి.. భవిష్యత్ కార్యాచరణను వివరించనున్నారు. కీలక దశలో బీజేపీలో అన్నీ తైనా వ్యవహరించిన కన్నా… పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందన్న భావనలో ఉన్నారు. రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితుల్లోనూ పార్టీకి నాయకత్వం అందించినా.. తగిన గుర్తింపు లభించలేదన్న ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్తారా లేదంటే వైసీపీలోకి వెళ్తారా అన్నదానిపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయ్. అయితే గత కొంత కాలంగా వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న కన్నా.. టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.