ఓటీటీకి సిద్ధమవుతున్న కంగువ…..!
తమిళ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేసిన కంగువ ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. కంగువ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు దాటేసింది. దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సౌండింగ్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండటంతో సినిమా గందరగోళంగా ఉంది అని చాలా మంది విమర్శించారు. సినిమా ను విమర్శిచినప్పకి మ్యూజిక్ విషయం లో మాత్రం అదరాహారో అనిపించుకుంది. తాజా గా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతోంది. పలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ని 100 కోట్ల కి కొనుగోలు చేసిందని సమాచారం వస్తుంది. ఒకవేళ అదే నిజమేతే డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీక్షించవచ్చు.