Andhra PradeshHome Page Slider

నవరాత్రి ఆరవరోజు ‘వీణాపాణి’గా దర్శనమిచ్చిన కనకదుర్గ

‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి…విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా’..అంటూ ఆ శారదా దేవిని విద్యారంభ సమయంలో కొలిచి ప్రార్థించిన వారికి కోరిన విద్యలనొసగి తరింపచేస్తుంది శారదామాత. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా,కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వీణాపాణిగా, ధవళవస్త్రాంబరధారియై అమ్మవారు నేడు దర్శనమిచ్చింది. నవరాత్రులలలో వచ్చే మూలా నక్షత్రం సరస్వతీ దేవి జన్మనక్షత్రం కావడంతో నేడు అమ్మవారిని సరస్వతిగా అలంకరించారు. ఈ మూర్తిని దర్శించుకుని, ప్రార్థనలు చేస్తే విద్యార్థులకు కోరుకున్న విద్య లభిస్తుంది. చక్కగా చదివినది గుర్తు పెట్టుకుని పరీక్షలలో విజయం సాధిస్తారని పండితుల వాక్కు. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్నం ప్రభుత్వం తరపున దుర్గమ్మవారిని దర్శించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీనితో వాహనాలను ఇంద్రకీలాద్రిపై అనుమతించడం లేదు. రద్దీ దృష్ట్యా కూడా వీఐపీ దర్శనాలను రద్దు చేశారు అధికారులు.