Andhra PradeshHome Page Slider

కైకలూరు ఎన్నికల్లో 2వ సారి నిలబడుతున్న కామినేని

ఏపీ: గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కామినేని శ్రీనివాస్ బీజేపీ తరఫున మళ్లీ బరిలోకి దిగుతున్నారు. 2014 లో టీడీపీ-బీజేపీ పొత్తులో ఈయన కృష్ణా (డి) కైకలూరు నుండి పోటీచేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో కీలకమైన వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు ముగియడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్‌లో సైలెంట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.