కమల్ హాసనా మజాకానా..రికార్డు ధరకు ఓటీటీ రైట్స్..
విలక్షణ నటుడు కమల్ హాసన్ యాక్టింగ్ అంటే ఇష్టం లేనివారుండరు. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన నటించిన విక్రమ్ చిత్రం ఈ మధ్య సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కమల్ ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలోని థగ్‌లైఫ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. అప్పుడే రూ.150 కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం రూ.150 కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. కమల్ చిత్రాలను చిన్న పిల్లల నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకూ అందరూ ఇష్టపడతారు. అందుకే ఓటీటీ రైట్స్‌కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది.


 
							 
							