రాజ్యసభకు కమల్ హాసన్
జూన్ 19న తమిళనాడు, అసోం రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 6, అసోంలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే.. తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే మద్దతుతో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కానున్నారు. 2024 ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందంలో భాగంగా కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు డీఎంకే పార్టీ కేటాయిస్తామని తెలిపింది. 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటును కమల్ కు కేటాయించింది.

