రాజ్యసభకు కమల్ హాసన్
ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్లో అడుగు పెట్టనున్నారు. తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ‘మక్కల్ నీది మయ్యం ( ఎంఎన్‌ఎమ్)’ అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్ అధికార డీఎంకే పార్టీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడే ఆయనను రాజ్యసభకు పంపుతామని సీఎం స్టాలిన్ మాట ఇచ్చారు. బుధవారం కమల్ హాసన్ నివాసానికి రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లడంతో ఈ విషయం ఖరారైనట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు.