“ప్రాజెక్ట్ K” లో తన పాత్ర ఏంటో చెప్పేసిన కమల్ హసన్
ప్రభాస్ హీరోగా రాబోతున్న ‘ప్రాజెక్ట్ K’ చిత్రంలో తన పాత్ర ఏంటో చెప్పేశారు కమల్ హసన్. ప్రాజెక్ట్ కే చిత్రానికి ‘కల్కి 2898 AD’ అని టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గ్లింప్స్ విడుదలైన సందర్భంలో ఈ చిత్రంలో తన పాత్ర గురించి రివీల్ చేశారు కమల్ హసన్. ఈ చిత్రంలో అమితాబ్, కమల్‌లు నటిస్తుండగా, కమల్ గొప్ప నటుడని, తన పాత్ర కోసం చాలా కష్టపడతాడని, వైవిధ్యభరిత పాత్రలు చేస్తాడంటూ అమితాబ్ మెచ్చుకున్నారు. కమల్ హసన్ మాట్లాడుతూ అమితాబ్ నటించిన ‘షోలే’ చిత్రం తనకు నచ్చలేదని, కానీ సూపర్ హిట్ అయ్యిందని, కానీ అమితాబ్ తన నటనపై ప్రశంసించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ, చిత్రంలో విలన్ పాత్ర చాలా ముఖ్యమైనదని, అందుకే ఈ చిత్రంలో తాను విలన్‌గా నటించబోతున్నానని పేర్కొన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ భారతీయ పురాణాలను విదేశీయులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందని, సూపర్ మ్యాన్, థోర్ లాంటి సూపర్ హీరోస్, హనుమంతుడికీ పోలిక చెప్పాలను కుంటున్నానని అన్నారు. భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చూపిస్తానని హామీ ఇచ్చారు.

