‘థగ్ లైఫ్’ చిత్రం కోసం డబ్బింగ్ చెబుతున్న కమల్ హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల ‘ఇండియన్-2’ (తెలుగులో భారతీయుడు-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ తరువాత ఆడియెన్స్‌ను పెద్దగా మెప్పించడంలో ఫెయిల్ కింద లెక్క. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది.
ఇక ఇప్పుడు కమల్ హాసన్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడు. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర కోసం కమల్ హాసన్ డబ్బింగ్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన అప్డేట్‌ను వీడియో రూపంలో పోస్ట్ చేశారు మేకర్స్. ‘థగ్ లైఫ్’ చిత్రంలో కమల్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో శింబు, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.