ఉద్యోగం కోల్పోయిన మహిళా డ్రైవర్‌కు కారు బహుకరించిన కమల్ హాసన్
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో మొదటి మహిళా డ్రైవర్‌గా సోషల్ మీడియాలో పేరుపొందిన షర్మిలకు తమిళ ప్రసిద్ధ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ కారును బహుమతిగా అందించారు. విషయమేమంటే ఆమె డ్రైవర్‌గా పని చేస్తున్నబస్సు యాజమాన్యం ఉద్యోగం నుండి తొలగించింది. ఆమెను ఉద్యోగం నుండి తొలగించిన విషయం తనకు చాలా బాధ కలిగించిందని, ఆమె డ్రైవర్‌గా మిగిలిపోకూడదని, ఓనర్‌గా ఉండాలని, స్వయంగా ఎంతోమందికి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ కారును బహుకరించినట్లు తెలిపారు కమల్. వేల సంవత్సరాల నుండి అణచివేతకు గురైన మహిళలు ఇప్పుడిప్పుడే పురుషులతో సమానంగా అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని, వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత సమాజానిదేనన్నారు కమల్ హాసన్.

డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల షర్మిల నడిపిన బస్సు ఎక్కారు. ఆమెను మెచ్చుకుని వాచీ కూడా బహుకరించారు. తర్వాత సంఘటనలలో తాను డ్రైవర్‌గా నడిపిన బస్సులోని మహిళా కండక్టర్ ఎంపీతో అనుచితంగా ప్రవర్తించిందని షర్మిల యాజమాన్యానికి ఫిర్యాదు చేసిందట. ఆ కండక్టర్ కూడా ప్రముఖులను ఆహ్వానిస్తూ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టలేదని, ప్రయాణికులను ఇబ్బందికి గురిచేస్తోందని షర్మిలపై ఫిర్యాదు చేసింది. ఈ వాదనతో ఏకీభవించిన యాజమాన్యం షర్మిలను ఉద్యోగం నుండి తొలగించింది.

