ప్రభుత్వానికి వేలం ద్వారా రావాల్సిన ఆదాయాన్ని కల్వకుంట్ల కుటుంబం గండికొట్టింది-భట్టి విక్రమార్క
ప్రభుత్వానికి వేలం ద్వారా రావాల్సిన ఆదాయాన్ని టానిక్ లాంటి మద్యం దుకాణాలు పెట్టి ప్రభుత్వానికి రాకుండా చేసి కొన్ని కుటుంబాల జేబుల్లోకి పోయేలా చేశారు అంటూ మండి పడ్డారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఎక్సైజ్ శాఖలో ఎంత దొరికితే అంత దోచుకుందామనే గత ప్రభుత్వం వేలం ముందే పెట్టారు. గత ప్రభుత్వం ఈ దురుద్దేశంతోనే వేలాన్ని ముందుగా నిర్వహించారన్నారు. అప్పుల లెక్కలు మాత్రమే చెప్పిన బీఆర్‌ఎస్ అమ్మకాల లెక్కలు చెప్పలేదని ప్రభుత్వం మండిపడింది.

