Breaking NewscrimeHome Page SliderTelangana

తెలంగాణ‌లో క‌ల్వ‌కుంట్ల వారి డ్రామాలు చెల్ల‌వు

అధికారం కోల్పోయాక బీఆర్ ఎస్ నేతలు మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నారని మంత్రి సీత‌క్క ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ సుఖ‌సంతోషాల‌తో ఉంటే…కొంత మంది స్వార్థ‌ప‌రులు తెలంగాలో అమాయ‌కుల‌ను పావుగా చేసుకుని హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని కేటిఆర్ ని ఉద్దేశ్యించి ప‌రోక్షింగా వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌ లౌకిక వాదాన్ని అమలు చేస్తే.. కొందరు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని బీజెపిని ఉద్దేశ్యించి చుర‌క‌లంటించారు. దేవుడు గుడి, చర్చి, మసీదు అన్ని చోట్ల ఉంటాడు.. ఎవరి నమ్మకం వారిది. కానీ దేవుడిని రోడ్ల మీద జెండాలపై.. రాజకీయ అజెండాలపై పెట్టవద్దని సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న సుప‌రిపాల‌ను చూసి ఓర్వ‌లేక విప‌క్షాలు ఇలాంటి దారుణాల‌కు ఒడిగ‌డుతున్నాయ‌ని ఆమె విమ‌ర్శించారు.