Home Page SliderNational

రికార్డు స్థాయిలో అమ్ముడైపోయిన ‘కల్కి’ అడ్వాన్స్ టికెట్స్

ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ అడ్వాన్స్ బుకింగులో రికార్డులు సృష్టిస్తోంది. బుక్ మై షో, పేటీయం టికెట్లలో ఆన్‌లైన్‌లో విడుదలైన నిముషాలలోనే టికెట్లు హౌస్‌ఫుల్ అయిపోతున్నాయి. అయితే కొందరికి ఈ చిత్రం బదులు  రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం టికెట్ బుకింగులో కనిపించడంతో కంగుతిన్నారు. అయితే ఈ కొత్త కల్కికే టిక్కెట్లు బుక్ అయ్యాయని, కంగారు పడొద్దని బుక్ మై షో సమాధానాలు ఇచ్చింది. కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు మహాభారతంలోని పాత్రలతో ముడిపెట్టి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథను సిద్ధం చేశారు. ఈ విజువల్ వండర్ కోసం సినిమా ప్రియులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.