Home Page SliderTelangana

కాళేశ్వరం నిర్మాణం నిండా డిజైన్ లోపాలే

కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం తప్పుడు డిజైన్లతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో తాను కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రైతులు సాగునీటి కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చానని, అయితే కేసీఆర్ ఇంజినీర్‌గా అవతారమెత్తి తన సొంత కల్పిత డిజైన్లతో ప్రాజెక్టు భవిష్యత్తు అయోమయంగా తయారుచేసి ప్రాజెక్టు దీర్ఘకాలిక మన్నిక లేకుండా నిర్మాణం చేపట్టడం జరిగింది. సీఎం కేసీఆర్ తన పిల్లల ఉపాధిపై అధిక ధ్యాస పెట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన కుటుంబ పాలనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రూ.1,100 కోట్లతో సోమశిల వద్ద కృష్ణానదిపై ఐకానిక్ వంతెన చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.