News

కె విశ్వనాథ్ సతీమణి కన్నుమూత

టాలీవుడ్ సినీరంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. విశ్వనాథ్ ఫిబ్రవరి 2న మరణించగా.. మరో దురదృష్టకర వార్త ఇవాళ వినాల్సి వచ్చింది. విశ్వనాథ్ భార్య కాశినాధుని జయలక్ష్మి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. విశ్వనాథ్ మృతితో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కె.విశ్వనాథ్ మరణించి కొద్ది రోజుల్లోనే జయలక్ష్మి మృతి చెందడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.