సుప్రీం సీజేగా జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణం
భారత సుప్రీకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ చేత ప్రమాణం చేయించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఎన్.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ లలిత్ సీజేఐగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు పలువురు హాజరయ్యారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 74 రోజులపాటు నవంబరు 8 తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తుంది.

