ఏపీ హైకోర్టు నూతన సీజేగా రేపు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ప్రమాణ స్వీకారం
ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్‌ను నియమిస్తూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రేపు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా రేపు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌తోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

