నామినేటెడ్ పదవుల భర్తీకి మరో వారమే?
ఏపీ: నామినేటెడ్ పోస్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు తుది దశకు వచ్చింది. మరో వారం, పది రోజుల్లో ఈ పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. తొలివిడతగా కొన్ని పదవులు భర్తీ చేయనున్నారు. పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయకుండా దశల వారీగా పూర్తి చేస్తారు. వీటిలో మిత్రపక్షాలు జేఎస్‌పీ, బీజేపీకి 20 శాతం పోస్టులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ప్రకారం వీటిని భర్తీ చేస్తారు.

