పాక్ పని అయిపోయినట్లే…పద్మవ్యూహం పన్నిన భారత్
పాకిస్తాన్‌కు చుట్టూ పద్మవ్యూహం పన్నింది భారత్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కోలుకోలేని దెబ్బ కొడతామని ప్రధాని ప్రకటించిన వారంలోనే నలువైపులా దాయాది దేశాన్ని ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే పాక్ విమానాలకు వాయుమార్గంపై ఆంక్షలు విధించిన భారత్, ఇప్పుడు సముద్రజలాలను కూడా నిషేధించింది. పాక్ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం విధించింది. అలాగే భారత్ ఓడలు పాక్ పోర్టులకు వెళ్లొద్దని తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వాణిజ్య యుద్ధం కూడా ప్రకటించింది. పాక్ నుంచి వచ్చే దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర వాణిజ్య శాఖ. మరోపక్క క్రికెట్‌లో కూడా బీసీసీఐ సూచనల ప్రకారం ఆసియా కప్ ట్రోఫీ నుండి పాక్‌ను నిషేధించే అవకాశాలున్నాయి.