Home Page SliderTelangana

కేసీఆర్ ఎట్లా ఓడిపోలేదో నేను కూడా ఒక్కసారి కూడా ఓడిపోలేదు!

కేసీఆర్ ఎట్లా ఓడిపోలేదో నేను కూడా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉంది. గజ్వేల్, కొండపాక మండలం, బందారంలో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాళేశ్వరం నీళ్లు బందారం రాకముందే గోదావరిలో మునిగిపోయింది. మన డబ్బులన్నీ గోదావరిపాలు చేశారని ఈటల దుయ్యబట్టారు. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మంచి విద్య, వైద్యం అందిస్తాం. నన్ను నమ్మండి.. ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మా మిత్రుడు నందిని సిధారెడ్డి ఊరు ఇది. మేమందరం అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పినవాళ్ళం. నేను మీకు తెలియని వాన్ని కాదు. తొలి ఆర్థిక మంత్రిగా… తరువాత వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కరోనా కష్టకాలంలో చనిపోతారు అనే భయం ఉన్నా లెక్కచేయకుండా సేవచేసిన వాన్ని.

నన్ను బయటకు పంపిన తరువాత మీ జిల్లా మంత్రి హరీష్ రావు హుజురాబాద్ వచ్చి కేసీఆర్ అక్రమ సంపాదన 600 కోట్లు ఆరు నెలల పాటు ఖర్చు పెట్టారు. వీడి మొఖం అసెంబ్లీలో కనపడవద్దు అని తిరిగారు. కాని మా ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు. కేసీఆర్ కి ఓటు వేసిన ఖర్మానికి మీ భూములు పోయాయి. కేసీఆర్ ఖర్మ పోవాలంటే ఓడిపోవాలని గజ్వేల్ వచ్చా. కేసీఆర్ ఎట్లా ఓడిపోలేదో నేను కూడా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉంది. ఎన్నడూ లేనిది కార్యకర్తలను బతిమలాడుతున్నారు. ఏది కావాలంటే అది ఇస్తా అంటున్నారు. ఇక్కడ ఇచ్చారా దళితబంధు, బీసీబంధు అన్నీ అబద్ధపు మాటలు. దళితబంధు కేవలం నన్ను ఓడగొట్టడానికి పెట్టారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నాడు మరి మనసులేదా ? కేసీఆర్ 10 ఏళ్లల్లో ఒక్క రేషన్ కార్డ్ ఇచ్చారా ! ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఎక్కాక బోడమల్లన్న అనేది కేసీఆర్ నైజం.

కాళేశ్వరం నీళ్లు బందారం రాకముందే గోదావరిలో మునిగిపోయింది. సద్దులు తినేదగ్గర, కలుపులు తీసేదగ్గర, వేపచెట్టు కింద కూర్చున్నదగ్గర ఆలోచన చేయండి. మన పిల్లలు ఉద్యోగాలకోసం కష్టపడి చదువుతుంటే.. మీకు కాదు పైరవీ చేసుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలు అని 17 పేపర్లు లీక్ కచేసిన వాడు కేసీఆర్. ప్రవల్లిక అనే అమ్మాయి పరీక్ష పోస్ట్ పోన్ అయ్యిందని ఆత్మహత్య చేసుకుంటే, దానికోసం కాదు అని అబద్ధం చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఉరికివచ్చే రైలు కింద పడి ముత్యాల శంకర్ ఉద్యోగం రాలేదు అని చనిపోయాడు. నేను హామీ ఇస్తున్నా.. బీజేపీనీ ఆశీర్వదిస్తే మీ అవసరాలు అన్నీ నెరవేరుస్తాం. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మంచి విద్య, వైద్యం అందిస్తాం. మోదీ దేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడుతున్నారు. ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో స్మశానవాటిక కట్టిస్తున్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రం నిధులే. నన్ను నమ్మండి.. ఆశీర్వదించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈటల పిలుపునిచ్చారు.