moviesNationalTrending Today

పవర్ ఫుల్ టైటిల్స్‌తో రచ్చ చేస్తున్న ఎన్టీఆర్

టాలీవుడ్ హీరోల కు సరైన టైటిల్ దొరక్క నానా తంటాలు పడుతుంటారు, తాజాగా విడుదలైన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల కోసం ఎప్పుడూ పవర్‌ఫుల్, క్రేజీ టైటిల్స్‌ను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఇది ఆయన సినిమాలకు మంచి హైప్ కలిగించేలా చేస్తుంది, ఈ టైటిల్స్ కేవలం సినిమాల పేరు మాత్రమే కాకుండా, వాటి కథాంశాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. అరవింద సమేత వీరరాఘవ, దేవర, వార్ 2 లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ పడుతున్నాయి. వార్ 2, డ్రాగన్ తర్వాత దేవర 2 లైన్‌లో ఉంది. దీని తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి దీనికి రాక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.