జూనియర్ ఎన్టీఆర్ పెద్దమనసు..భారీ విరాళం
ఏపీ, తెలంగాణ భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టానికి గురవడం తనను బాగా కలిచివేసిందని స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫీలయ్యారు. ఆయన తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించి, తన పెద్దమనసు చాటుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారు త్వరగా ఈ విపత్తు నుండి కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తనవంతు సహాయంగా సహాయక చర్యల కోసం ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. దీనితో ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించినట్లయ్యింది. ఈ సంగతి తెలిసిన ఆయన అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు.

