Home Page SliderInternationalmoviesNewsTrending Today

జపాన్‌లో అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా జపాన్‌లో తాను నటించిన దేవర చిత్రం రిలీజ్ కాబోతుండడంతో ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. ఈ చిత్రంలోని ఆయుధ పూజ పాటకు ఒక అభిమానితో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టారు ఎన్టీఆర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవర చిత్ర డైరక్టర్ కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ చిత్రం జపనీస్ భాషలో ఈ నెల 28న విడుదల కాబోతోంది.

https://twitter.com/i/status/1904127791521771770