ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం
ఈరోజు హైదరాబాదులో కేపీహెచ్‌బీ- మూసాపేట మధ్యగల కైత్లాపూర్ మైదానంలో జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కాలేకపోతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశారు. తనకు గల ముందస్తు కార్యక్రమాల కారణంగానే ఈ వేడుకలకు రాలేకపోతున్నానని, ఆహ్వానం అందించినప్పుడే సావనీర్ కమిటీకి ఈ విషయం చెప్పానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మురళీమోహన్, వెంకటేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రానా, సుమన్, కళ్యాణ్‌రామ్ వంటి సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. పది ఎకరాల స్థలంలోని ఈ కార్యక్రమానికి సభ ఏర్పాటు చేశారు. 200 మందికి వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్‌లు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని ఉత్సవ కమిటీ ఛైర్మన్ తెలియజేశారు.