Andhra PradeshHome Page Slider

వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో తీర్పు రిజర్వ్

ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని వైసీపీ నేతలు,కార్యకర్తలు ఇది కేవలం రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపిస్తున్నారు. అయితే ఏపీలో ఇప్పటికే రెండు వైసీపీ కార్యాలయాలను ప్రభుత్వ అధికారులు కూల్చేశారు. కాగా మరో 16 వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ  లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. కాగా దీనిపై తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపారు.