గౌతమ్ అదానీకి జడ్ ప్లస్ భద్రత
దేశంలోని అనేక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పటిష్టవంతమైన భద్రతను కల్పిస్తోంది. ఇప్పటికే ముఖేష్ అంబానీ దంపతులకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తుంటే .. ఇప్పుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్రం జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్‌పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణ కల్పిస్తారు. మొత్తం 33 మంది కమాండోలు ఆయనకు కాపలాగా ఉంటారు. దేశంలో అదానీ ఎక్కడికి వెళ్లినా కమాండోలు ఆయనకు రక్షణ కవచంలా వ్యవహరిస్తారు.

ఇందుకు అయ్యే నెసరి ఖర్చు 20 లక్షల రూపాయల వరకు అదానీయే భరించాల్సి ఉంది. దేశంలోని కొందరు ప్రముఖులకు ముప్పు ఉందని కేంద్ర భద్రతా ఏజెన్సీలు రూపొందించిన నివేదిక ఆధారంగా అదానీకి భద్రత కల్పించినట్లు వారు తెలిపారు. ఈ బాధ్యతను చేపట్టాలని సీఆర్పీఎఫ్ కు చెందిన వీఐపీ సెక్యూరిటీ విభాగానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితునిగా అదానీకి పేరుంది. ఆ సానిహిత్యం ద్వారానే ఆయన ప్రభుత్వం అన్ని రకాలుగా లబ్ది పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


