డ్రగ్స్‌పై జూ.ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు
డ్రగ్స్ ఉచ్చులో పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు జూనియర్ ఎన్టీఆర్. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి తన వంతుగా మద్దతు ఇస్తానన్నారు. ప్రజలందరూ కూడా సహకరించాలన్నారు. కొందరు తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడిని తట్టుకోవడానికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం బాధాకరమన్నారు. జీవితం చాలా విలువైనదని, తనతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ కొనుగోలు చేసినా, వినియోగించినా, అమ్మకం జరిపినా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

