Home Page SliderTelangana

జక్కన్న సినిమాతో తారక్ కుమారుడు సినిమా ఎంట్రీ

అభిమానులు  జక్కన్నగా పిలుచుకునే పాన్ ఇండియా డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనే జూనియర్ ఎన్టీఆర్ (తారక్) పెద్ద కుమారుడు అభయ్ రామ్ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితార పాపకు తమ్ముడిగా నటించబోతున్నాడట. ఈ విషయం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమాలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాలోనే ఇంట్రడక్షన్ సీన్‌లో సితార-అభయ్ రామ్ అక్కాతమ్ముళ్లుగా కనిపించేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే సితార మల్టి టాలెంటడ్ బేబీగా నిరూపించుకుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ కూడా తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటాడేమో వెండితెరపై చూడాల్సిందే.