Home Page SliderTelangana

ఏకతాటిపైకి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు, మీడియా అకాడెమీ చైర్మన్ భరోసా

హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీల ఐక్యకార్యాచరణ సమితి సమావేశం సోమవారం దేశోద్ధారక భవన్‌లో ది జర్నలిస్టు హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ సీనియర్ సభ్యులు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ హౌసింగ్ సోసైటీ సభ్యుల బృందం (The Journalist cooprative Housing Socity Limited, Telangana Journalists Co opparative Housing socity, Deccan Journalists M.Aided Cooparative Housing Socity) సభ్యులు కలిసి నాన్ అలాటీ జర్నలిస్టులందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు ఇప్పించాలని మీడియా అకాడమీ చైర్మన్‌ను కోరారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తామని వారు తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో సొసైటీలకు అతీతంగా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో జర్నలిస్టులతో జరిగే ముఖ్యమంత్రి సభ, జర్నలిస్టులందరికీ శుభవార్త అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జవహర్‌ సొసైటీ సభ్యులకు భూమి అప్పగింత జరిగే కార్యక్రమంలో మూడు సంఘాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుండి నిర్దిష్టమైన హామీ వచ్చేలా ప్రయత్నించాలని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌‌ని JAC కోరడం జరిగింది. అదే సభలో సీఎం ద్వారా ప్రకటన చేయించే విధంగా కృషి చేస్తానని చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి మూడు సంఘాలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సొసైటీల సభ్యులకు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. సాధ్యమైనంత తొందరగా జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇప్పించడం కోసం ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

JAC ఒక ఉమ్మడి జాబితా తయారు చేసి శ్రీనివాసరెడ్డికి అందించే ప్రయత్నం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇక మన JCHSLలో ఉన్న 1108 Non allotees సభ్యుల వివరాలను ఇంతకుముందే వారికి అందించినట్టు చెప్పారు. కొద్ది రోజుల్లోనే మిగతా రెండు సొసైటీల్లో ఉన్న సభ్యుల వడపోత జరిగి ఫైనల్‌ లిస్ట్‌ ఇవ్వాల్సి ఉంది. ఈ సమావేశంలో TUWJ జనరల్‌ సెక్రటరీ విరాహత్‌ అలీ, టీ శాట్ చైర్మన్ బి.వేణుగోపాల్ రెడ్డి, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ సిరిగిరి విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు బ్రహ్మండబేరి గోపరాజు, భీమగాని మహేశ్వర్, ఎం.సూరజ్ కుమార్, సీహెచ్ రాకేష్ రెడ్డి, బి.రవి, ఎం.శ్రీనివాస్ , అయ్యప్ప, రామకృష్ణ, శిగ శంకర్ గౌడ్, సునీత, రవీంద్రబాబు పాల్గొన్నారు.