టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు
వైసీపీలో కి పెదకూరపాడు, కన్నెగండ్ల వాసులు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలను వైసీపీ వైపు ఆకర్షిస్తున్నాయని.. అందుకే పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు అన్నారు. పెదకూరపాడు మండలం కన్నెగండ్లకకు చెందిన దాదాపు 25 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్వయంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు మాట్లాడుతూ.. సీఎం జగన్ కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నందునే తమ పార్టీలో ప్రజలు చేరుతున్నారని, రానున్న ఎన్నికల్లో జగన్ మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. వైసీపీలో చేరిన వారిలో పెద్దింటి భాస్కరరావు, కోరంపల్లి వీరవసంతరావు, శనగవరపు శివనారాయణ, శనగవరపు నరేష్, చూలగిరి రామారావు, తొర్రికొంట వెంకటేశ్వర్లు, షేక్ పీర్ సాహెబ్, బొమ్మన ప్రసాద్, మద్దిగుంట వెంకటేశ్వర్లు, చత్రాసుపల్లి వెంకటేశ్వరరావు, ప్రొద్దుటూరి రామదాసురావు, ప్రొద్దుటూరి రామదాసురావు గోగులపాటి కృష్ణారావు తదితరులు ఉన్నారు.


