Home Page SliderTelangana

కిషన్ రెడ్డి, ఈటల సమక్షంలో బీజేపీలో కీలక నేతల చేరిక

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయ్. తాజాగా మేధావులు, పారిశ్రామికవేత్తలు పలువురు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. తాండ్ర వినోద్ రావు: ఖమ్మం జిల్లాకు చెందిన వారు. బిల్డర్, సోషల్ యాక్టివిస్ట్. ఆయనతోపాటు పైడి ఎల్లారెడ్డి : జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సైంటిస్ట్, ఫార్మా కంపెనీల అధినేతతోపాటుగా, గాండే సుధాకర్ వరంగల్‌కి చెందిన వారు, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చేసారు. అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకులో కీలక స్థాయిలో, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు సమస్యలు తీర్చడానికి ఆర్బీఐ అపాయింట్ చేసిన వారు. 12 దేశాల్లో వేలమందికి ఉపాధి కలిస్తున్నారు. ముగ్గురికీ కాషాయ కండువా కప్పి, బీజేపీలోకి స్వాగతం పలికారు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మోదీ పదేళ్ల పాలన చూసిన తరువాత చాలామంది బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. మేధావులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు బీజేపీలో చేరడమంటే దేశానికి సేవ చేసేందుకేనన్నారు. వారందరికీ సాదరస్వాగతం పలుకుతున్నామని ఈటల అన్నారు.