బీజేపీలో చేరికలు అంత ఈజీ కాదు
ఎన్నికల అనంతరం ఏపీలో పార్టీలలో చేరికలు మొదలయ్యాయి. అయితే బీజేపీ పార్టీలో చేరికలు అంత ఈజీ కాదంటోంది అధిష్టానం. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఎవరు పార్టీలోకి వస్తామంటే వారిని చేర్చుకునే పరిస్థితి లేదు. మండల, జిల్లా పరిషత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. చిన్న,పెద్ద లీడర్లను వివిధస్థాయిలలో క్యాండిడేట్లను స్క్రూటినీ చేసి మరీ చేర్చుకోవాలనుకుంటున్నారు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి పార్టీల మధ్య మనస్పర్థలు రాకుండా విపక్ష పార్టీ నుండి చేరికలు ఉండబోతాయి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై వ్యక్తిగత విమర్శలు చేసిన నేతలను, వివిధ కేసులలో చిక్కుకుపోయిన నేతలను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించే పరిస్థితి లేదు. వారికోసం కూటమి ప్రయోజనాలను పణంగా పెట్టలేమని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. అంతేకాక కేంద్రంలో కూడా టీడీపీ పార్టీ ఎన్డీయే కూటమిలో బలంగా ఉండడంతో చేరికల కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న భావన వ్యక్తమవుతోంది.