జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరయ్యింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో ఆయన ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు వచ్చింది. తిరు చిత్రంలోని మేఘం కరిగేనా అనే పాటకు ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ పాటలో తమిళహీరో ధనుష్, నిత్యామీనన్, రాశిఖన్నా నటించారు. దానిని తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లాలని, మధ్యంతర బెయిల్ కావాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారించిన కోర్టు ఆయనకు అక్టోబర్ 6 నుండి 10 వతేదీ వరకూ రిలాక్స్ ఇస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 25 వేలు పూచీకత్తు ఇవ్వాలని షరతు పెట్టారు. ఈ కేసులో బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేయడంతో ఆయనపై పోక్సో చట్టం కింద కూడా కేసులు పెట్టారు.