Home Page SliderNational

జానీ మాస్టర్ అరెస్ట్.. ఎక్కడ దొరికారంటే?

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించిన కేసులో తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్ ఎట్టకేలకు దొరికారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసుల బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అరెస్టు చేసింది. నేడు హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఉప్పరపల్లి కోర్టులో ఆయనను హాజరుపరుస్తారని సమాచారం. 21ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ తనను 16 ఏళ్ల వయసు నుండి కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేశారని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆమె మైనర్‌గా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగినందువల్ల అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

2019లో అతని బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరానని ఆమె పేర్కొంది. ముంబయిలో షూటింగ్ నిమిత్తం వెళ్లినప్పుడు అక్కడ హోటల్‌లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదని బెదిరించారని, సినిమా పరిశ్రమలో లేకుండా చేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ సంఘటన తర్వాత ఇతర నగరాలకు వెళ్లిన సందర్భాలలో కూడా తనపై పలుమార్లు అత్యాచారం చేశారని, వ్యానిటీ వ్యాన్‌లో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదు చేశారు. మతం మార్చుకుని, తనను వివాహం చేసుకోవాలని వేధించేవాడని, ఆ వేధింపులు భరించలేక బయటకొచ్చేశానని పేర్కొంది. అయినా వేధింపులు మానలేదని, ఇతర ప్రాజెక్టులు రాకుండా అడ్డుపడ్డాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఫిలిం సొసైటీలో కూడా ఆయనపై కేసు నమోదయ్యింది.