తెలంగాణా హైకోర్టులో కొలువుల జాతర
తెలంగాణా హైకోర్టులో ఒకేసారి 176 పోస్టులకు గాను 9 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. వీటిలో మహిళలకు 72 కేటాయించబడ్డాయి.
హైకోర్టు సబార్డినేట్, ఎగ్జామినర్, అసిస్టెంట్లు, యూడీ స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్లు, సిస్టం అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, తెలుగు,ఉర్దూ ట్రాన్సలేటర్లు, కోర్టు మాస్టర్లు మొదలైన ఉద్యోగాలకు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటికి ఆన్‌లైన్‌లో జనవరి 21 నుండి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.