రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్ల జాబ్ గ్యారంటీ
ఆంధ్రప్రదేశ్: రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రకటించారు. చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వాళ్లనే కొనసాగిస్తాం. జులై 1న వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయిస్తాం అని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.