Home Page SliderInternational

జోక్విన్ ఫీనిక్స్ రూనీ మారాను ‘భార్య’ అనడంతో పెళ్లి పుకార్లు షురూ

హాలీవుడ్ ఐకాన్ జోక్విన్ ఫీనిక్స్ (జోకర్ యాక్టర్) ఫస్ట్ టైమ్ నటుడు రూనీ మారాను తన ‘భార్య’ అని బహిరంగంగా పేర్కొన్న తర్వాత పెళ్లి పుకార్లకు దారితీసింది. ఈ జంట 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. నటుడు పాడ్‌కాస్ట్ సమయంలో మొదటిసారిగా మారాను ‘భార్య’ అని బహిరంగంగా పిలిచాడు. జోకర్ నటుడు తన వైవాహిక స్థితిని స్పష్టం చేయకుండా తప్పించుకున్నాడు. హాలీవుడ్ నటుడు జోక్విన్ ఫీనిక్స్, 49, ఇటీవల తన దీర్ఘకాల భాగస్వామి రూనీ మారాతో వివాహ పుకార్లకు ఆజ్యం పోశాడు. టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రాగోసో పోడ్‌కాస్ట్‌లో ఆదివారం ప్రదర్శన సందర్భంగా, జోకర్ స్టార్ తన 2020 ఆస్కార్ ప్రసంగాన్ని డిస్‌కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైమ్ 39 ఏళ్ల ఆమెను తన ‘భార్య’ అని బహిరంగంగా పేర్కొన్నాడు.