తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్!
టిజి: కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీగా జితేందర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.