Home Page SliderTelangana

తెలంగాణా గవర్నర్‌గా ప్రమాణం చేయనున్న జిష్ణు దేవ్

తెలంగాణా నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్ నియమింపబడిన విషయం తెలిసిందే. అయితే రేపు ఆయన రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాణ స్వీకారం రోజే ఆయన తెలంగాణాకు రానున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో త్రిపుర నుంచి గవర్నర్‌గా ఎంపికైన మొదటి వ్యక్తి తానేనని ఆయన పేర్కొన్నారు. అయితే త్రిపుర వెలుపల పనిచేయాలని నియామకానికి ముందే తాను మోదీకి తెలిపానన్నారు. కాగా దానికి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కాల్ చేసి స్వాగతించారన్నారు. అయితే జిష్ణు దేవ్ త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు.కాగా జిష్ణు దేవ్ తెలంగాణా రాష్ట్రానికి మూడవ గవర్నర్‌గా నియమితులయ్యారు.