జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా
దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా ‘జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా’ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 18-28 మధ్యలో కొత్తగా జియో ఫైబర్ కనెక్షన్లు , ప్లాన్స్ తీసుకునే వారికి రూ.6,500 వరకు విలువ చేసే ప్రయోజనాలను అందిచనున్నట్టు పేర్కొంది. వీటిలో 100 శాతం వేల్యూ బ్యాక్‌తో పాటు , 15 రోజుల అదనపు వ్యాలిడిటీ ఉచింతంగా ఉంటాయని తెలిపింది. అయితే రూ.599 , రూ.899 ప్లాన్లు గల రీఛార్జి పథాకాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీటితో పాటు నెలకు రూ.899 చొప్పున మూడు నెలలు ప్లాన్‌కి 100 శాతం వేల్యూ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు , కానీ 15 రోజుల అదనపు వ్యాలిడిటీ మాత్రం దీనికి లభించదని తెలిపింది.