Home Page SliderNational

వినియోగదారులకు షాకిచ్చిన జియో

దేశవ్యాప్తంగా తమ వినియోగదారులకు జియో షాకిచ్చింది. అదేంటంటే జియో పోస్ట్ పెయిడ్ ఛార్జీలను భారీగా పెంచడమే. ఇప్పటివరకు  జియో ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ.199గా ఉంది. నేటి నుంచి దీని ధరను రూ.299కి జియో అమాంతం పెంచేసింది. కాగా దీనిలో గతంలో లాగానే బెనిఫిట్స్ లభించనున్నాయి. అదనంగా 5 GB డేటాను అందించనున్నట్లు జియో తెలిపింది. మొత్తంగా ఈ ప్లాన్‌లో 30 GB  హైస్పీడ్ డేటా,అన్‌లిమిటెడ్ కాలింగ్,రోజుకు 100 SMSలు పొందవచ్చు. దీంతో ఇప్పుడు పాత ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ.199ను అందుబాటులో లేకుండా పోయింది.