ఝార్ఖండ్ కర్ణిసేన రాష్ట్ర అద్యక్షుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ఝార్ఖండ్ లో దారుణం చోటుచేసుకుంది. కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌సింగ్ (46) మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండటంతో పాటు ఆయన తలకు బుల్లెట్ గాయం కావడంతో పాటు చేతిలో పిస్టల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినయ్‌సింగ్ కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, వెంటనే ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా జంషెడ్‌పూర్‌లో ఉన్నట్లు గుర్తించాం. అక్కడికి వెళ్లేసరికి ఆయన మృతదేహం కనిపించింది. ఆయన తలకు బుల్లెట్ గాయమవగా, ఎడమ చేతిలో పిస్టల్ ఉంది. వినయ్‌సింగ్ మరికొందరితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన్ను నిజంగానే ఎవరైనా కాల్చి చంపారా?లేక అతనే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో విచారిస్తున్నామన్నారు.

